హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు రైతులు మరణించారు. మరో 15 మంది గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి ఆందోళకరంగా ఉంది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం దేవేపల్లికి చెందిన రైతులు కూరగాయల లారీలో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. లంగర్‌హౌస్ సమీపంలోని బండ్లగుడా వద్ద ఈ లారీ మరో లారీని ఢీకొని చెట్టుకు ఢీకొట్టింది. గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ ఆస్పత్రికి వెళ్లి సందర్శించారు.వీరిని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.