శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని ఉత్తర బారాముల్లా జిల్లాబల్‌హామా గ్రామంలో ఐదుగురిని ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టిన బలగాలు హతమార్చాయి. ఈ సంఘటనలో మరో ముగ్గురు గ్రామస్థులు గాయపడ్డారు.
భద్రతా బలగాల సహకారంతో ఉగ్రవాద వ్యతిరేక బలగాలు గ్రామంపై దాడి చేసి కొందరు వ్యక్తులనుఅరెస్టు చేయడానికి ప్రయత్నించాయి. ఈ బలగాలను గ్రామస్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత గాయపడినవారిలో ఒక వ్యక్తి మరణించాడు.