మంత్రి ఎస్కార్ట్ జీపు ప్రమాదంలోఆరుగురి మృతి
ఖమ్మంః రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఎస్కార్ట్ జీపు ప్రమాదవశాత్తు ఓపెట్రోల్ ట్యాంకర్‌ను డీకొన్న దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. ఈ ప్రమాదంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌తో సహా కానిస్టేబుల్స్ మరణించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కారు ప్రమాదం నుంచి తప్పించుకుంది.
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించేందుకు గురువారం బయలుదేరారు. ఆయన కారులో వెళ్తుండగా ఎదురుగాపెట్రోల్ ట్యాంకర్ అతి వేగంగా రావడం గమనించి డ్రైవర్ మంత్రి కారును పక్కకు తప్పించాడు. దీంతో మంత్రి ప్రమాదం నుంచి బయట పడ్డారు. అయితే వెనుకే వస్తున్న మంత్రి ఎస్కార్ట్ జీపుపెట్రోల్ ట్యాంక్‌ను ఢీకొట్టింది. పెట్రోల్ ట్యాంక్‌పేలిపోయింది. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్, ఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుల్స్ మరణించారు.












Click it and Unblock the Notifications