హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్మార్ గవర్నమెంట్‌కు అనుగుణంగా పాత భవనాలను కూల్చి వేసి కొత్త భవనాలు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం సచివాలయంలోని డి బ్లాక్ నిర్మాణం సాగుతోంది. ఈ నిర్మాణం పనులను ముఖ్యమంత్రి గురువారం సాదారణ పరిపాలనా విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. నాలుగు అంతస్థులతో 22 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ బ్లాక్ భవనం వచ్చే రాష్ట్రావతరణ దినోత్సవం నవంబర్ 1వ తేదీ నాటికి పూర్తవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ బ్లాక్‌లో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. చిన్న భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో సాఫ్ట్‌వేర్, బాండ్‌విడ్త్‌లకు అనుగుణంగా భవనాలు నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ భవనాల నిర్మాణం వేగంగా జరగడానికి పాత కాంట్రాక్టర్ల స్థానంలో కొత్త కాంట్రాక్టర్లకు పనులుఅప్పగించారు. సచివాలయం ప్రవేశ ద్వారం, రోడ్ల నిర్మాణం పనులు త్వరలో పూర్తవుతాయని చంద్రబాబు చెప్పారు.