పూణే: పూణేలోని సూతర్‌వాడి సమీపంలోని హై ఎనర్జీ మెటరీయల్స్ రీసెర్చ్ లాబొరేటరీ కర్మాగారంలో సంభవించిన పేలుడులో ఆరుగురు మృతి చెందారు.
లాబొరేటరీలోని ప్రొపెలంట్ ప్రాసెసింగ్ భవనంలో నిప్పుఅంటుకోవడంతో ఈ పేలుడు సంభవించినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఇందులో ఇద్దరు అధికారులు, నలుగురు కాంట్రాక్టు కార్మికులు మరణించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తంసాస్సన్ ఆస్పత్రికి తరలించారు. మంటలు అంటుకోవడానికి గల కారణాలు తెలియాల్సి వుంది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులువిచారణకు ఆదేశించారు.