న్యూఢిల్లీ: గుజరాత్ వ్యవహారంపై 184 నిబంధన కింద లోక్‌సభలో జరిగే చర్చవిషయంలో అనుసరించాల్సిన వైఖరిని ఈ నెల 28వ తేదీని ఖరారు చేసుకుంటామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టిడిపిపి) నేతకె. ఎర్రంనాయుడు చెప్పారు.
ఈ నెల 28వ తేదీన జరిగే టిడిపిపి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. గుజరాత్ వ్యవహారంపై లోకసభలో జరిగే చర్చవిషయంలో టిడిపిపిలో భేదాభిప్రాయలున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.