ప్రభుత్వానికి ఢోకా లేదు: వాజ్‌పేయి
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వానికి ఏ మాత్రం ఢోకా లేదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో వుంటుందని ఆయన స్పష్టం చేశారు. భారత పరిశ్రమల సమాఖ్య సదస్సులో ఆయన శనివారం ప్రసంగించారు.
గుజరాత్ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసినవిమర్శలను ప్రధాని తిప్పికొట్టారు. గుజరాత్ హింస వల్ల విదేశీ పెట్టుబడులకు అవరోధం ఏర్పడడమే కాకుండా దేశ పరిశ్రమలుదెబ్బ తింటాయని, దేశ ప్రతిష్ట దెబ్బ తింటుందని సోనియా గాంధీ శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) సదస్సులో చెప్పిన విషయం తెలిసిందే.
సదస్సులను ప్రారంభించడానికి, ముగించడానికి ఆహ్వానాలుఅందితే రాజకీయ గాలుల దిశలో వచ్చే మార్పులపై ఊహాగానాలు చేయడానికి వారికి అవకాశం లభిస్తుంది. కామర్స్, ఇండస్ట్రీ ఛేంబర్స్ మాత్రమే ప్రజల కన్నా ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం గానీ, పడడగొట్టడం గానీ చేస్తాయని అటువంటి వారు అనుకుంటున్నారని నేను చెప్పాల్సి వస్తుంది అని ఆయన సోనియాను ఉద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications
