మాచవరం ఎస్‌ఐపై వార్‌ కాల్పులు

గుంటూరు: గుంటూరు జిల్లా మాచవరం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై సాయుధపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు శనివారం ఉదయం కాల్పులు జరిపారు.

పోలీసులు తెలిపినవివరాల ప్రకారం- మాచర్ల సబ్‌ డివిజన్‌లోని మాచవరం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ వై. శ్రీనివాస రావు ఉదయం 8 గంటల ప్రాంతంలో మోటారుసైకిల్‌పై వెళ్తున్నారు. ఈ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్లు ఆయనకు తాకలేదు. దీంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది.

తమ ప్రయత్నం విఫలం కావడంతో వారు ఆటో రిక్షాలో బ్రాహ్మణపల్లి వైపు పారిపోయారు. ఎస్‌ఐపై కాల్పులు జరిపిన ఆ ఇద్దరుపీపుల్స్‌వార్‌ నక్సలైట్లేనని పోలీసులు అంటున్నారు.విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్‌పి రామాంజనేయులు అన్ని పోలీసుస్టేషన్లను అప్రమత్తం చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+