కెసిఆర్‌కు బుద్ధి చెప్తారు: టిడిపి
హైదరాబాద్: తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లబ్ధి పొందడానికి తెలంగాణ రాష్ట్ర సమితి నేతకె. చంద్రశేఖర్ రావు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశంవిమర్శించింది.
తెలంగాణ రాష్ట్ర సమితి తప్పుడు విధానాలను ప్రజలు గుర్తిస్తున్నారని ఆయన అన్నారు. నీటి పారుదల,విద్య, వైద్యం, తదితర రంగాల్లో తెలంగాణకు తమ పార్టీ ప్రభుత్వం ఎంతో చేసిందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పాలనలో తెలంగాణ వెనుకబడిందనే చంద్రశేఖర్ రావువిమర్శను ఆయన ఖండించారు. తెలంగాణ ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కూడా వాస్తవాలు గుర్తిస్తున్నారని, చంద్రశేఖర్ రావు నడవడి సక్రమంగా లేకపోవడాన్ని పసిగడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
