న్యూఢిల్లీః జమ్మూలో టెర్రరిస్టులు సాగిస్తున్న నరమేధానికి ప్రభుత్వం తగురీతిలో సమాధానం ఇస్తుందని ప్రధాని వాజ్‌పేయి బుధవారం నాడు అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్‌కు చెప్పారు.
బుధవారం సాయంత్రం జార్జ్‌బుష్ ప్రధాని వాజ్‌పేయికి ఫోన్‌చేసి మంగళవారం నాడు జమ్మూలో టెర్రరిస్టులు సాగించిన మారణహోమాన్ని తీవ్రంగా ఖండించారు. సంఘటన పట్ల బుష్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారని భారత్ పరిస్థితినిఅర్ధం చేసుకోగలమని చెప్పారని విదేశాంగ శాఖ ప్రతినిధి నిరుపమారావు తెలిపారు. ఇదిలా వుండగా విదేశాంగ శాఖ జాయింట్‌సెక్రటరీ జయంత్ ప్రసాద్ బుధవారం నాడు అమెరికా బయలుదేరి వెళ్లారు. కాశ్మీర్ వ్యవహారం, పాకిస్తాన్ వైఖరిపై అమెరికా అధికారులతో ప్రసాద్ చర్చించే అవకాశం వున్నదని తెలిసింది.