ఇంఫాల్: మణిపూర్ తీవ్రవాదులుగా భావిస్తున్నవారు సోమవారం సంగ్సద్ చేసిన మెరుపుదాడిలో పది మంది అస్సాం రైఫిల్స్ జవాన్లు మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఇంఫాల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో జరిగింది.
భద్రతాధికారులు ఇంఫాల్‌కు తిరిగి వస్తుండగా 25వ బెటాలియన్‌కు చెందినఅస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై సాయుధ తీవ్రవాదులు మెరుపుదాడి చేశారు. సంఘటనకు సంబంధించిన సమాచారంఅందిన వెంటనే భద్రతా బలగాలు హుటాహుటిన బయలుదేరి వెళ్లాయి.పెద్ద యెత్తున గాలింపు చర్యలు చేపట్టారు. సాయుధ తీవ్రవాదులు దట్టమైన అడవి,పర్వత ప్రాంతాల గుండా పారిపోయారు.