ఆల్మాటీ డిక్లరేషన్ ఎన్‌డిఎవిజయం: జనా
ఉజ్జెయిన్: ఆల్మాటీ డిక్లరేషన్‌ను భారత జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) దౌత్యవిజయంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి అభివర్ణించారు. బుధవారం ఇక్కడికి చేరుకున్న వెంటనే ఆయనవిలేకరులతో మాట్లాడారు.
మహారాష్ట్రలో డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోలేని ప్రస్తుత పరిస్థితిలో బిజెపి వైఖరి ఏమిటని ప్రశ్నిస్తే- ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలా, మళ్లీ ఎన్నికలకు వెళ్లాలా అనేవిషయమై నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నర్ అని ఆయన జవాబిచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి మాయావతి గత బిజెపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించమో, బిజెపి నేతలను వేధించడమో చేస్తున్నారనేవిమర్శల్లో నిజం లేదని ఆయన అన్నారు. 2003 నవంబర్‌లో జరిగే మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి, బిఎస్‌పి కలిసి పోటీ చేస్తాయా అని అడిగితే ఈవిషయమై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
