ఐఎఎస్‌ ల అవినీతిపై దద్దరిల్లిన సభ

హైదరాబాద్‌ః రాష్ట్రంలోనిఐఎసి, ఐపిఎస్‌. ఇతర ఉన్నతాధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని ప్రతపక్షాలుఅసెంబ్లీలో ధ్వజమెత్తాయి. కనీసం 50 మంది ఐఎఎస్‌, ఐపిఎస్‌ లపై అవినీతి ఆరోపణలు వున్నా, వారిపై చర్య తీసుకొనేందుకు ప్రభుత్వం ఎసిబికి అనుమతి ఇవ్వడం లేదంటూ ఒక వార్తా పత్రిక మంగళవారం ప్రచురించింది. ఆ వార్తఅసెంబ్లీలో గందరగోళానికి కారణం అయింది. అవినీతి అధికారులపై చర్య తీసుకోకుండా ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి.

చంద్రబాబు నాయుడు కావాలనే ఉన్నతాధికారుల కొమ్ము కాస్తున్నారని సిఎల్పి నేత వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి ఆరోపించారు.
ఈ అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ త్రోసిపుచ్చారు.అందుకు ఆగ్రహించిన ప్రతిపక్షాలు ప్రశ్నోత్తరాల సమయానికి పదే పదే అడ్డుతగిలారు. ప్రతిపక్షాలు అనవసరవిషయాలపై సభా సమయాన్ని వృధా చేస్తున్నారనిఅధికారపక్ష సభ్యులు ఎదురుదాడికి దిగారు. గుడ్‌ గవర్నెన్స్‌అంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడుతున్నారని పత్రికలుపేర్లతో సహా ప్రకటించినా మౌనం వహించడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.

ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం చర్చకు అనుమతించక పోవడంతో ప్రతిపక్ష సభ్యులు ఆ దినపత్రిక జిరాక్స్‌ కాపీలనుసభలో ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.అయినా ప్రభుత్వం నోరువిప్పకపోవడంతో కాంగ్రెస్‌, సిపిఎం సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+