రూ.611 కోట్ల సాయానికి బాబువిజ్ఞప్తి
న్యూఢిల్లీ: కరవు సహాయ చర్యలకు 611 కోట్ల రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. ఆయన గురువారం ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని కలిసి ఈవిజ్ఞప్తి చేశారు.
రాష్ట్రపతిగా అబ్దుల్ కలామ్ ప్రమాణ స్వీకారోత్సవానికిహాజరు కావడానికి ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీని కలుసుకున్నారు. న్యాయశాఖ మంత్రి జనా కృష్ణమూర్తిని కూడా ఆయన కలుసుకున్నారు. మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలుసుకున్నట్లు రాజకీయవర్గాలు చెప్పాయి.రైల్వే మంత్రి నితీష్ కుమార్‌తో కూడా ఆయన సమావేశమయ్యారు. ఆగ్నేయరైల్వే జోన్‌ను భువనేశ్వర్‌కు మార్చవద్దని ఆయన నితీష్ కుమార్‌నుకోరారు. రైల్వే అంశాల అధ్యయనానికి రాష్ట్రానికి ఒక నిపుణుల బృందాన్ని రాష్ట్రానికి పంపుతామని నితీష్ కుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications