IPL 2027: పంత్ రీఎంట్రీ..! హార్దిక్ పాండ్యా, సూర్య దారెటు ? జోరుగా ట్రేడింగ్..!

వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2027) సీజన్ హడావిడిగా ఈసారి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. మినీ ఆక్షన్ కు ముందే పలు జట్లు ఈ ఏడాది ప్రదర్శనలు, ఇతర సమీకరణాల ఆధారంగా ఆటగాళ్లను మార్చేసుకుంటున్నాయి. ఆక్షన్ వరకూ ఆగకుండా ముందే ఓపెన్ అయిన ట్రేడ్ విండోలో లెక్కలు తేల్చేసుకుంటున్నాయి. దీంతో కీలక ఆటగాళ్లు జట్లు మారిపోతున్నారు. తద్వారా వచ్చే సీజన్ కు ఇప్పటినుంచే సిద్దం కావచ్చని ఆటగాళ్లతో పాటు ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

టీమిండియా కోచ్ రాజీనామా..! బీసీసీకి సమాచారం..!
టీమిండియా కోచ్ రాజీనామా..! బీసీసీకి సమాచారం..!

ఐపీఎల్ 2027 మినీ వేలానికి ఇంకా చాలా సమయం ఉన్నా.. ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల బదిలీల సందడి మాత్రం ఇప్పటికే మొదలైపోయింది. డిసెంబర్‌లో జరిగే మినీ వేలానికి ముందే తమ జట్లను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు ఫ్రాంచైజీలు ప్రయత్నిస్తున్నాయి. కేవలం వేలంపైనే ఆధారపడకుండా, ట్రేడింగ్ విండో ద్వారా జట్లలోని లోపాలను సవరించుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఇందులో భాగంగానే ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఒక భారీ ట్రేడ్ జరగడం, దానికి అధికారికంగా ఆమోదముద్ర పడటం కూడా జరిగిపోయాయి.

IPL 2027 Trading Updates Rishabh Pant Returns to Delhi Capitals Hardik Pandya Rumors Swirl
Team India: టీమిండియా ప్రక్షాళన..! కోచ్ ల తర్వాత మరో వికెట్ రెడీ ..?
Team India: టీమిండియా ప్రక్షాళన..! కోచ్ ల తర్వాత మరో వికెట్ రెడీ ..?

దీని ద్వారా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్ తిరిగి తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు చేరుకున్నాడు. గతంలో ఢిల్లీకి ఆడిన పంత్, ఇప్పుడు రూ. 15కోట్ల వేతనంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నాడు. గతంలో లక్నో పంత్ ను రూ.27 కోట్లకు దక్కించుకున్నా పేలవ ప్రదర్శనతో నిరాశపర్చాడు. మరోవైపు చైనమన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రూ.13.50 కోట్ల కాంట్రాక్టుతో లక్నోలో చేరాడు. ఈ బదిలీతో లక్నో పర్స్ బడ్జెట్ సుమారు రూ.13.75 కోట్లు పెరగగా, ఢిల్లీ బడ్జెట్ రూ.1.25 కోట్లు తగ్గింది. పంత్, కుల్దీప్ మార్పిళ్లు విజయవంతంగా పూర్తవడంతో, ఇప్పుడు అందరి దృష్టి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మీద పడుతోంది.

IPL 2027 Trading Updates Rishabh Pant Returns to Delhi Capitals Hardik Pandya Rumors Swirl
ICC: ఇక ఐపీఎల్ తరహాలో వన్డే, టీ20 వరల్డ్ కప్ లు-ఐసీసీ కొత్త రూల్స్..!
ICC: ఇక ఐపీఎల్ తరహాలో వన్డే, టీ20 వరల్డ్ కప్ లు-ఐసీసీ కొత్త రూల్స్..!

హార్దిక్‌ను దక్కించుకోవడానికి కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ఆసక్తిగా ఉన్నాయి. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా శివమ్ దూబే, ఆయుష్ మ్హాత్రేలను ముంబైకి ఇచ్చి హార్దిక్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు టీమిండియా మాజీ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను తమ జట్టులోకి తెచ్చుకుని కెప్టెన్ గా నియమించాలని కేకేఆర్ భావిస్తోంది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఆల్‌రౌండర్లు సామ్ కరన్, రొమారియో షెపర్డ్ బదిలీలపై కూడా ప్రచారం మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+