పనికి ఆహారంపై దర్యాప్తునకు నో
హైదరాబాద్: పనికి ఆహార పథకం అమలులో జరుగుతున్న అవకతవకలపై దర్యాప్తు జరపాలనే కాంగ్రెస్ డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు గురువారం శాసనసభ నుంచి వాకౌట్ చేశారు.
కాంగ్రెస్ డిమాండ్‌ను హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ తిరస్కరించారు. అవకతవకలు జరిగిన సంఘటనలను తమ దృష్టికి తెస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మంత్రి సమాధానానికి సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications