గ్రెనేడ్‌ పేల్చినమిలిటెంట్లు- ఒకరి మృతి

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌లోమిలిటెంట్లు విసిరిన గ్రెనేడ్‌ పేలి ఒక వ్యక్తి మరణించగా, 18 మంది గాయపడ్డారు.సెక్యూరిటీ క్యాంప్‌పై గురువారం మిలిటెంట్లు గ్రెనేడ్‌ పేల్చడానికి ప్రయత్నించారు. అయితే అది గురి తప్పి బటమలూబస్‌ స్టాండ్‌ వద్ద రద్దీగా ఉన్న రోడ్డుపై పడింది. ఈ సంఘటనలో ఒకరు మరణించగా, 18 మంది గాయపడ్డారు.

మొత్తం 19 మందిని ఆస్పత్రిలో చేర్పినట్లు, అయితే ఒకరు మృతి చెందినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. మరణించిన వ్యక్తిని అబ్దుల్‌ గనీ భట్‌గా గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందినఆర్‌.ఎం. బియా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్‌ అనుకూల తీవ్రవాద సంస్థ ఆల్‌-బర్గ్‌ చెప్పుకుంది. ఈ సంఘటనలో ముగ్గురు బిఎస్‌ఎఫ్‌ జవాన్లు కూడా గాయపడినట్లు సమాచారం. ఇయితే దీన్ని బిఎస్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి ఖండిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+