డిఎస్‌సి నియామకాలపై కెసిఆర్ వాకౌట్
హైదరాబాద్: తెలంగాణలో స్థానికేతరులకు నిబంధనలు అతిక్రమించి ఉద్యోగాలు ఇచ్చిన వ్యవహారంపైవిచారణ జరుపుతున్న కమిషన్ నివేదిక రాకముందే మళ్లీ డిఎస్‌సి నిర్వహించడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) సభ్యుడుకె. చంద్రశేఖర్ రావు గురువారం శాసనసభ నుంచి వాకౌట్ చేశారు.
610 జివోపై విచారణ జరుపుతున్న గిర్గలానీ కమిషన్, సభా సంఘం నివేదికలుఅందగానే అన్యాయాలు జరిగినట్లు తేలితే వాటిని సరిదిద్దుతామని పాఠశాల విద్యామంత్రి మండవ వేంకటేశ్వరరావు తరఫున భారీ నీటి పారుదల మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. తెలంగాణపేరిట కొందరు రాజకీయం చేస్తున్నారని ఆయనవిమర్శించారు. తెలంగాణ అభివృద్ధిపై, ప్రజలపై వారికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications