విజన్‌ అత్యవసరం: అబ్దుల్‌ కలామ్‌

న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం, కొన్ని అంతర్గత సమస్యలు, నిరుద్యోగం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికివిజన్‌ అవసరమని నూతన రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌ అన్నారు. నేడు మన దేశం సీమాంతర ఉగ్రవాదం, అంతర్గత వైరుధ్యాలు, నిరుద్యోగం వంటి సమస్యలను ఎదుర్కుంటోందని, ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఒకవిజన్‌ అవసరమని ఆయన రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అన్నారు.

భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఈవిజన్‌ అవసరమని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఒకటే ఈవిజన్‌ను సాధిస్తుందా? ఇప్పుడు మనకు కావాల్సింది దేశంలో కదలిక. ప్రజలను కదలించడానికి ఇదేసరైన సమయం. దాని కోసం మనం పని చేయాలి. వేగంగా మార్పు చెందే పాఠాన్ని నేర్చుకోకపోతే మనం అభివృద్ధి చెందిన జాతిగా ఆవిర్భవించలేం అని ఆయన అన్నారు.

తాను లౌకిక విధానానికి కట్టుబడి వున్నానని, ఇది మన జాతీయతకు కీలకమైందని, మన నాగరికత పటిష్టత లక్షణమని ఆయన అన్నారు. గత ఏడాదికాలంలో తాను అనేక మంది మత గురువులను కలిశానని, ప్రజల బౌద్ధిక, హృదయ ఏకత సాధిస్తే త్వరంలోనే దేశంలోస్వర్ణయుగం ఆరంభమవుతుందనే ఒకేఒక సందేశం వారందరూ ఇచ్చారని ఆయన అన్నారు.

మన ప్రజల, మన జాతి గౌరవార్ధం రాజ్యాంగ ప్రక్రియను గౌరవించి, పరిరక్షించడం మన ప్రథమ లక్ష్యం కావాలని ఆయన అన్నారు.పేదరిక, నిరుద్యోగ నిర్మూలనతో వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తూనే జాతీయ భద్రతను ప్రతి భారతీయుడు జాతీయ ప్రాధాన్యంగా గుర్తించాలని కలామ్‌ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+