ఐదుగురు సిఎంలను చూసిన కృష్ణకాంత్
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ తో దివంగత ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ కు అవినాభావ సంబంధం వుంది. 1990 నుంచి ఏడున్నరేళ్ళ పాటు ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా వున్నారు. ఇంత సుదీర్ఘకాలం ఆంధ్ర గవర్నర్ గా పనిచేసిన ఘనతకూడా ఆయనకేదక్కుతుందేమో. కృష్ణకాంత్ గవర్నర్ గా వున్న సమయంలో ఆయన ఐదుగురు ముఖ్యమంత్రులనుచూశారు. ఆయన 1990లో రాష్ట్రానికి గవర్నర్‌గా వచ్చినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది.
చంద్రబాబు టి.డి.ఎల్.పి నేతగా ఎన్నికైనప్పటికీ ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు కృష్ణకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొంతవిమర్శకు దారితీసింది. గవర్నర్ గానే కాకుండా ఆయన సతీమణి సుమన్ కృష్ణకాంత్ తో కలిసి పలు సామాజిక,స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన సారా ఉద్యమాన్ని ఆయన ఎంతగానో సమర్థించారు.












Click it and Unblock the Notifications