ఐఐఎస్‌ అధికారిఅరెస్టు

హైదరాబాద్‌: బ్యాంకు కుంభకోణంలో ఇండియన్‌ ఇన్‌ఫర్మేషన్‌సర్వీసు (ఐఐఎస్‌) అధికారిని పోలీసులు అరెస్టు చేశారు.విజయరాజు అనే ఐఐఎస్‌ అధికారిని 1.50 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ పోలీసులుఅరెస్టు చేశారు.

ఈ కేసులో పోలీసులు పది మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసుల కథనం ప్రకారం-విజయరాజు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందినఫీల్డ్‌ పబ్లిసిటీ విభాగంలో 29 మంది విద్యార్థులున్నట్లు చూపి, వారికి తప్పుడుప్లే సిప్‌లు ఇచ్చి పర్సనల్‌ లోన్లకు దరఖాస్తులు చేయించాడు. 14 బ్యాంకుల్లో ఈ రుణాలకు దరఖాస్తులు పెట్టించాడు. విడుదలైన రుణాల్లో పది శాతం మాత్రం దరఖాస్తుదార్లకు ఇచ్చిమిగతా మొత్తాన్ని తాను తీసుకున్నాడు. ఈ కుంభకోణంలో కొందరు బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉన్నారనే అనుమానాన్ని డిసిపి ఆనంద్‌ వ్యక్తం చేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+