పోలీస్ జులుంపై దద్దరిల్లినఅసెంబ్లీ
హైదరాబాద్‌ః రాష్ట్రంలో దళితులు, బడుగులు, మహిళలపై పోలీసుల జులుం నానాటికీ పెరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని పట్టుపట్టింది. అందుకు స్పీకర్ నో అనడంతో సభలో అరగంటకు పైగా తీవ్రదుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానం స్పష్టంగా లేదని, సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం కావాలని హోం మంత్రి దేవేందర్ గౌడ్ అన్నారు. దీంతో తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రతిభాభారతి వెల్లడించారు.












Click it and Unblock the Notifications