శాసనసభ నిరవధిక వాయిదా
హైదరాబాద్‌ః అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శనివారంతో ముగిశాయి. ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ మృతికి సంతాప తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రతిభా భారతి ప్రకటించారు. రెండు వారాల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ సంక్షోభం, కరవు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. అయితే ఈ చర్చ నామమాత్రంగా, మొక్కుబడిగా సాగాయనే విమర్శ వుంది.












Click it and Unblock the Notifications