కృష్ణకాంత్ కు తెలుగునేల నివాళి
హైదరాబాద్‌ః గుండెపోటుతో కన్నుమూసిన ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ కు ఆంధ్రప్రదేశ్‌అసెంబ్లీ ఘనంగా నివాళి అర్పించింది. ఆయన మృతికి సంతాపంగా శనివారం ప్రభుత్వ సెలవుదినం ప్రకటించారు. మూడురోజుల సాధారణ సంతాపదినాలుగా పాటిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణకాంత్ మృతికి అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అన్ని రాజకీయ పార్టీలు ఘనంగా నివాళులు అర్పించాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపతీర్మానాన్ని ప్రవేశపెడుతూ విధి ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో కృష్ణకాంత్ హఠాన్మరణాన్ని చూస్తే అర్ధం అవుతుందన్నారు. గురువారం నాడు కలాం ఇంగ్లీషులో చేసిన ప్రసంగాన్ని ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ హిందీలో జనరంజకంగా చదివి వినిపించారని ఇంతలోనే ఆయన గుండెపోటుతో మరణించడం బాధాకరమన్నారు.












Click it and Unblock the Notifications