ఎనమిది మందినక్సలైట్ల లొంగుబాటు
హైదరాబాద్:పీపుల్స్‌వార్ నక్సలైట్లు ఎనమండుగురు శనివారం పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి)పేర్వారం రాములు ముందు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లలో ఇద్దరు కమాండర్లు, ఒక డిప్యూటీ కమాండర్ ఉన్నారు.
పీపుల్స్‌వార్ సిద్ధాంతాలతో విసిగిపోయి, జన జీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితాన్నిగడపాలనే ఉద్దేశంతోవీరు లొంగిపోయినట్లు డిజిపి విలేకరులకు చెప్పారు.మిగతా వారు ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి తెలంగాణ జిల్లాల్లో పని చేశారు. అనారోగ్య కారణంగా తాము లొంగిపోతున్నట్లువీరు చెప్పారని పేర్వారం రాములు తెలిపారు.
లొంగిపోయిన నక్సలైట్లలో సింగాపూర్ దళం డిప్యూటీ కమాండర్‌ఎం. సత్యనారాయణ అలియాస్ కొమరన్న ఉన్నాడు. ఆదిలాబాద్ జిల్లాలో ఇతను యాక్షన్‌టీమ్ సభ్యుడిగా పని చేశాడు. 1995లో నిర్మల్‌లో జరిగిన జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ రమేష్ రెడ్డి హత్య కేసులో ఇతను ఉన్నట్లు డిజిపి చెప్పారు.












Click it and Unblock the Notifications