ఇందిరను ఎదిరించిన యంగ్‌ టర్క్‌

న్యూఢిల్లీః శాస్త్రవేత్తగా జీవితాన్ని ప్రారంభించి, సామాజికసేవ, రాజకీయ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి కృష్ణకాంత్‌. 1927 ఫిబ్రవరి 28న పంజాబ్‌ లోని అమృతసర్‌ సమీపంలో జన్మించిన కృష్ణకాంత్‌ బెనారస్‌విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ టెక్నాలజీ అభ్యసించారు. ఢిల్లీలో శాస్త్రవేత్తగా ఉద్యోగం చేశారు. ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు.అంచలంచెలుగా ఎదిగిన కృష్ణకాంత్‌ హర్యానా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి సారధ్యం వహించారు.

1966-72 మధ్య రాజ్యసభ సభ్యుడిగా, 1977-79 మధ్య లోక్‌ సభ్‌ సభ్యుడిగా వున్న కృష్ణకాంత్‌ మాజీ ప్రధాని చంద్రశేఖర్‌, మోహన్‌ ధారియాతో కలిసి యంగ్‌ టర్క్‌ లుగా పేరుపడ్డారు. కాంగ్రెస్‌ లోవీరి హవా బాగా నడించింది. అయితే ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా జైలుకు వెళ్ళారు. కాంగ్రెస్‌ నుంచి బహిష్కారానికి గురయ్యారు. జయప్రకాష్‌ నారాయణన్‌ భావజాలంతో ఆయన బాగా ప్రభావితులయ్యారు.

1990 నుంచి ఏడున్నర సంవత్సరాల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ గా వున్నారు. ఆ తరువాత ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.వివాదరహితుడిగా మంచి పేరున్న కృష్ణకాంత్‌పేరు రాష్ట్రపతి పదవికి దాదాపు ఖరారైంది. అయితే చివరి నిముషంలో ఆయనకు అదృష్టం ముఖం చాటేసింది. మొదటి నుంచి చంద్రబాబు, ములాయంలపై గంపెడాశపెట్టుకున్న కృష్ణకాంత్‌ ను చివరిదాకా సమర్థించిన ఎన్డీఏ చివరినిముషంలోప్లేటు మార్చి అబ్దుల్‌ కలాం ను రాష్ట్రపతిని చేసింది. ఈ బాధే ఆయననుమింగేసిందనే విమర్శలు బలంగా వున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+