కోల్‌కతాః పశ్చిమ బెంగాల్‌లో వివిధ జిల్లాల్లో సుమారు ఏడువేల మందిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
దుండగులు ఒక జిల్లా నుంచి మరోజిల్లాకు పారిపోకుండా ఏక కాలంలో 20 జిల్లాల్లో ఈ దాడులను నిర్వహించారు.అరెస్టయిన వారిలో అత్యధికులు పాత కేడీలే.వీరిపై వివిధ కేసులు వున్నాయి. అరెస్టయిన వారికి తీవ్రవాదులతో సంఘవిద్రోహ ముఠాలతో సంబంధాలు వున్నాయని ఇంకా దాడులు కొనసాగించి మరికొంత మందినిఅరెస్టు చేస్తామని బెంగాల్ పోలీసులు చెప్పారు.