నిజామాబాద్‌ః నిజామాబాద్ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. యడపల్లి మండలం దూపల్లి సమీపంలో పదిమంది ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు డీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగాఅందులో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు.గాయపడిన వారిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా కూరగాయలు అమ్ముకొని పొట్టపోసుకొనే వారే.