బియ్యంపై తూర్పున కాంగ్రెస్ నిరసన
రాజమండ్రిః తూర్పుగోదావరి జిల్లాలో పనికి ఆహారపథకంలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా కాంగ్రెస్ పార్టీ రణభేరి మోగించింది. జిల్లా కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో శనివారం నాడు బిక్కవోలులోపెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. 60 లక్షల రూపాయలవిలువైన బియ్యం స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యేకు చెందిన గోడౌన్ లలో మూలుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ బియ్యాన్ని స్థానిక ఎమ్మెల్ల్యే అక్రమంగా తన గోడౌన్ కు తరలించినా అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఆయనపై చర్యతీసుకొనేందుకు అధికారులు వెనకాడుతున్నారని వారువిమర్శించారు.












Click it and Unblock the Notifications