నక్సల్స్ తో చర్చలకు సిద్ధమేః గౌడ్
ఏలూరుః నక్సలైట్లతో నేరుగా చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధంగా వున్నదని హోం మంత్రి దేవేందర్ గౌడ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో శనివారం ఆయనవిలేకర్లతో మాట్లాడారు. తీవ్రవాద నిర్మూలన లక్ష్యంతో వార్ ప్రతినిధులతో ప్రభుత్వం ముందస్తు చర్చలు జరిపిందన్నారు. నిజానికి వార్ నేతలతో చర్చలు జరగలేదని, వారి ప్రతినిధులతో జరిగిన చర్చలు మాత్రమే మధ్యలో ఆగిపోయాయని ఆయన అన్నారు. నక్సలైట్లు నేతలు నేరుగా చర్చలకు వస్తే ఇప్పటికీ ప్రభుత్వం సిద్ధంగా వున్నదన్నారు.












Click it and Unblock the Notifications