కమలం కళపెరగాలిః వాజ్ పేయి
న్యూఢిల్లీః భారతీయ జనతాపార్టీ సొంతబలంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదగాలని ప్రధాని వాజ్‌పేయి పిలుపునిచ్చారు. శనివారం కొత్తఢిల్లీలో ప్రారంభమైన బిజెపి కార్యవర్గ సమావేశంలో వాజ్‌పేయి ప్రసంగించారు. బిజెపికి మరింత శక్తి వచ్చినప్పుడే పార్టీ విధానాలను అమలు చేయకలుగుతుందని, ఇప్పుడు ఎన్డీఏ ఎజెండాకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తున్నదని వాజ్‌పేయి అన్నారు. కొన్ని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కోరుతున్న విధంగా రైతులకు ఉచితవిద్యుత్ సాధ్యం కాదన్నారు.
క్రమశిక్షణ తప్పే వారిని సహించేది లేదని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని బిజెపిలో ఏ మాత్రం ఒప్పుకోనని ఆయన కరాఖండిగా చెప్పారు.గుజరాత్ తో సహా వివిధ రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చూపేందుకు సమాయంత్తం కావలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. మొత్తంమీద యువకుల సారధ్యంలో బిజెపి జాతీయ సమావేశంలో నూతనతేజం వెల్లివిరిసింది.












Click it and Unblock the Notifications