విపక్షాలపై బిజెపి నేత ఆగ్రహం

న్యూఢిల్లీః ప్రతిపక్ష పార్టీలు కట్టుదప్పి వ్యవహరిస్తున్నాయని బిజెపి అధ్యక్షుడు వెంకయ్యనాయుడు తీవ్రంగా దుయ్యబట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్లమెంటులో బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల పార్టీలఅస్థిరపరచే ప్రయత్నాల పట్ల ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మనం ఆలోచనలో ముందున్నాం. కాంగ్రెస్‌, కమ్యూనిస్టు కూటమి దుష్ట రాజకీయాలను ఎండగట్టడానికి మన చర్యల్లో దూకుడుగా ఉందాం అని ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. శనివారం జరిగిన పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు.

గుజరాత్‌, జమ్మూ కాశ్మీర్‌లతో పాటు పది రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశం రూపొందిస్తుంది. కాంగ్రెస్‌ను సమర్థంగా ఎదుర్కొని, నిర్ణయాత్మకంగా ఓడించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉండవచ్చు గాక దేశం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలను పట్టించుకోవడంలోవిఫలమైందని వెంకయ్యనాయుడు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+