కోస్తా, తెలంగాణాల్లో భారీవర్షాలు
హైదరాబాద్‌ః తీవ్రదుర్భిక్షంలో చిక్కుకున్న రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా, తెలంగాణా జిల్లాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. అన్ని కోస్తా జిల్లాల్లో 3సెంటీమీటర్లకు పైనే వర్షం కురిసింది. మే నెలాఖరులో కరుసిన వర్షం తరువాత ఒక మోస్తరు వర్షం పడడం ఇదే ప్రధమం. ఈ వర్షం వల్ల రైతులకుపెద్దగా ఒరిగేదేమీ లేనప్పటికీ ముందుముందు ప్రయోజనం వుంటుందని ఆశిస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా శని, ఆదివారాల్లో ఒకమోస్తరు వర్షాలు పడగా సోమవారం మంచి వాన పడింది.కైకలూరులో 7, రాజమండ్రిలో ఐదు, నెల్లూరులో మూడు, నిజామాబాద్ లో 2సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications