రాంనాయక్ రాజీనామా తప్పదుఃకాంగ్రెస్
న్యూఢిల్లీఃపెట్రోల్ బంకుల డీలర్ షిప్ ల వ్యవహారంలో వాజ్‌పేయి తీసుకున్న నిర్ణయం బిజెపిని ఇరకాటంలో పడేసింది. డీలర్ షిప్ లను రద్దుచేయడంతో ప్రధాని తప్పు ఒప్పుకున్నరని, తప్పుచేసినపెట్రోలియం మంత్రి రాం నాయక్ ను తక్షణం క్యాబినెట్ నుంచి తప్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. డీలర్ షిప్ లు రద్దు చేస్తూ ప్రభుత్వం తప్పు ఒప్పుకోవడం ప్రజాస్వామ్యం సాధించినవిజయం అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎస్. జైపాల్ రెడ్డి అన్నారు. ఇక రాం నాయక్ రాజీనామా మాత్రమేమిగిలి వున్నదని ఆయన సోమవారం విలేకర్ల సమావేశంలో చెప్పారు.












Click it and Unblock the Notifications