న్యూఢిల్లీః ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో వచ్చిన సూచనల ఆధారంగా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన ముసాయిదా ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్ మంగళవారం రాత్రి ఆమోదించింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నేరచరితులను ఎన్నికలకు దూరంగా వుంచేందుకువీలుగా ఎన్నికల కమిషన్ రూపొందించి జారీ చేసిన మార్గదర్శక సూత్రాల స్థానంలో ప్రవేశపెట్టేందుకు ఈ బిల్లును రూపొందించారు. పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే ఈ బిల్లును సభలో వుంచనున్నట్టుగా కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో కొందరు నేతలు ముసాయిదా బిల్లులోని కొన్నిఅంశాలకు సవరణలు ప్రతిపాదించారని వాటిని ఈ కొత్త బిల్లులో చేర్చామని ఆమె చెప్పారు.