మీనాక్షీ స్థానంలో కీలక నేతకు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు- రాహుల్ నిర్ణయం వెనుక...!!
తెలంగాణ కాంగ్రెస్ పైన హైకమాండ్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాల పైన పట్టు మరింతగా పెంచుకో వాలని నిర్ణయించిన పార్టీ నాయకత్వం వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణ లో కీలక నిర్ణయాలకు సిద్దమైంది. అందు లో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మార్పు చేస్తున్నారు. పార్టీ ముఖ్య నేతకు బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక నేరుగా పార్టీ హైకమాండ్ తెలంగాణలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించాలని నిర్ణయించినట్లు సమాచారం.
తెలంగాణలో కాంగ్రెస్ వ్యవహారాల పైన రాహుల్ ఫోకస్ చేసారు. పార్టీ విజయం సాధించిన తరువాత దీపాదాస్ మున్షీని పార్టీ ఇంఛార్జ్ గా నియమించారు. కాగా, ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో అవసరాలు.. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా కొత్త ఇంఛార్జ్ ల నియామకం పైన నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇక, ప్రస్తుత తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ స్థానంలో కీలక నేత ముకుల్ వాస్నిక్ ను నియమించాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ఇంఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్టడీ టూర్‌కు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు. దాదాపు 10 నెలల పాటు సాగే ప్రత్యేక కోర్సు , రీసెర్చ్ ప్రోగ్రామ్ కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని, ఈ కాలంలో ప్రత్యక్ష రాజకీయ కార్యకలాపాలకు , పార్టీ అధికారిక బాధ్యతలకు దూరంగా ఉండనున్నారు.

తెలంగాణ కేంద్రంగా హైకమాండ్ కీలక నిర్ణయాలు
దీంతో.. కీలకమైన తెలంగాణ బాధ్యతలను ముకుల్ వాస్నిక్ కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతల సమాచారం. తెలంగాణలో పార్టీని మరింతగా బలోపేతం చేయటంతో పాటుగా పీసీసీ - జిల్ కేడర్ మధ్య సమన్వయం కోసం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కొనసాగుతోంది. కొండా సురేఖ వేటు విషయంలో కఠినంగా వ్యవహరించిన పార్టీ నాయకత్వం ఎక్కడా పార్టీకి నష్టం చేసే చర్యలను ఉపేక్షించకూడదని నిర్ణయించింది. తెలంగాణలోనూ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా... ప్రభుత్వం- పార్టీ మధ్య సమన్వయంతో పాటుగా వ్యూహాలను అమలు చేసే విధంగా కొత్త ఇంఛార్జ్ విషయంలో పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నియామకం పైన పార్టీ నాయకత్వం అధికారి కంగా ప్రకటన చేయాల్సి ఉంది.













Click it and Unblock the Notifications
