1980s Retro వైబ్స్‌తో ఇన్‌స్టా షేక్! మీ ఫోటోనూ ఇలా మార్చేయండి

సోషల్ మీడియాను ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త క్రేజ్ ఊపేస్తూనే ఉంటుంది. కానీ ఈసారి వచ్చిన ట్రెండ్ మాత్రం మామూలుగా లేదు బాస్! మన ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఫీడ్‌లను ఓపెన్ చేస్తే చాలు... అంతా 1980ల నాటి వింటేజ్ వైబ్స్ కలర్‌ఫుల్‌గా దర్శనమిస్తున్నాయి. మన సాధారణ సెల్ఫీలను ఏఐ టూల్స్ సాయంతో1980 కాలంలో బాలీవుడ్ హీరో, హీరోయిన్ల రేంజ్‌లోకి మార్చేస్తూ నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. కేవలం కుర్రకారే కాకుండా కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్స్ కూడా ఈ '80s AI అవతార్' రీల్స్, పిక్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు!

పొలిటికల్ పోరులోకి ఏఐ వైబ్స్!

ఈ రెట్రో పిచ్చి కేవలం సరదాకే పరిమితం కాలేదు. బీజేపీ, కాంగ్రెస్ ఐటీ సెల్స్ మధ్య మీమ్ వార్స్ నడవడానికి కూడా ఈ ట్రెండే వేదికైంది. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, కిరణ్ రిజిజు, చిరాగ్ పాశ్వాన్, అస్సాం సిఎమ్ హిమంత బిశ్వ శర్మ వంటి ప్రముఖులు తమ ఏఐ రెట్రో పిక్స్‌ని షేర్ చేసి నెటిజన్లను సర్ ప్రైజ్ చేశారు. "నాక్కూడా ఈ 80ల నాటి నాస్టాల్జియా ఫీలింగ్ తట్టుకోలేక ట్రై చేశా!" అంటూ కిరణ్ రిజిజు సరదాగా పోస్ట్ చేశారు. మరోవైపు శశి థరూర్, రేణుకా చౌదరి వంటి నేతలు "మాకు ఏఐ అక్కర్లేదు.. నిజమైన 80ల కాలం నాటి ఫోటోలే ఇవిగో" అంటూ తమ రియల్ ఓల్డ్ పిక్స్ షేర్ చేసి భలే కౌంటర్ ఇచ్చారు!

How to Create Viral 1980s Retro AI Photos Using ChatGPT Step-By-Step Guide for Instagram and X Trends

ఏంటీ 80ల ఏఐ పిక్ మ్యాజిక్?

ఇది ఏదో సాధారణ ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్ అనుకుంటే పొరపాటే! చాట్‌ జీపీటీ (ChatGPT) లాంటి అత్యాధునిక ఏఐ టూల్స్ వాడి మన ఫేస్ మారకుండానే... బ్యాక్‌గ్రౌండ్, బట్టలు, హెయిర్‌స్టైల్, లైటింగ్ మొత్తాన్ని ఆ కాలపు రీతిలోకి మార్చేస్తున్నారు. పెద్ద పెద్ద క్రాప్‌ హెయిర్, వింటేజ్ ఏవియేటర్ గ్లాసెస్, గాఢమైన కలర్స్, ఓల్డ్ రీల్స్ నాటి కొద్దిపాటి గ్రెయిన్ ఎఫెక్ట్‌తో ఈ ఫోటోలు పక్కా ఓల్డ్ ఫిల్మ్ పోస్టర్లలా కనిపించడమే దీని ప్రత్యేకం. క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్‌ల 80ల నాటి లుక్స్ పిక్స్ కూడా వైరల్‌గా మారాయి.

ChatGPT మిమ్మల్ని చూస్తుంది, వింటుంది, గుర్తుపెట్టుకుంటుంది..! ఆల్ట్ మన్ సంచలనం..!
ChatGPT మిమ్మల్ని చూస్తుంది, వింటుంది, గుర్తుపెట్టుకుంటుంది..! ఆల్ట్ మన్ సంచలనం..!

మీరూ కూడా ఈ 80ల లుక్ ట్రై చేయాలా? చాలా ఈజీ!

ఫోటోషాప్, ఎడిటింగ్ నాలెడ్జ్ ఏమీ లేకపోయినా సరే.. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే ఫ్రీగా మీ ఫోటోను 80ల నాటి వింటేజ్ లుక్‌లోకి మార్చుకోవచ్చు. దానికి చిన్న ప్రాసెస్ ఇక్కడ చూడండి:

  • మీ మొబైల్‌లో ChatGPT యాప్‌ను ఓపెన్ చేయండి.
  • ప్లస్ (+) సింబల్‌పై క్లిక్ చేసి, మీ ముఖం స్పష్టంగా కనిపిస్తున్న మంచి క్వాలిటీ ఫోటోను అప్‌లోడ్ చేయండి.

క్రింద ఇచ్చిన ప్రాంప్ట్‌ను కాపీ చేసి పేస్ట్ చేయండి:

"Reimagine this image as a glamorous 1980s Indian film portrait. Retain the subject's recognisable facial features and natural skin tone. Add voluminous, softly curled hair, a bold and colourful outfit, statement jewellery, warm studio-style lighting, rich cinematic tones and a subtle vintage film grain. Ensure the final image looks realistic, polished and elegant."

90 ఏళ్ల మ్యాథ్స్ చిక్కుముడిని 88 గంటల్లో విప్పిన ఏఐ
90 ఏళ్ల మ్యాథ్స్ చిక్కుముడిని 88 గంటల్లో విప్పిన ఏఐ

అంతే! కొన్ని సెకన్లలో ఏఐ మిమ్మల్ని 1980ల నాటి ఐకానిక్ వింటేజ్ లుక్‌లోకి మార్చేస్తుంది. మీకా లుక్ ఇంకా నచ్చకపోతే చాట్‌జిపిటితోనే చిన్న చిన్న మార్పులు (హెయిర్‌స్టైల్, డ్రెస్ కలర్) చేసుకొని పర్ఫెక్ట్ పిక్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యమెందుకు... మీరూ ఒక చేతి చూసి మీ ఏఐ పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేయండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+