బాబు పదవిపై విశాఖబాలిక కన్ను!
విశాఖపట్నంః బాగా చదువుకొని నేనూ ముఖ్యమంత్రిని అవుతాననివిశాఖపట్నం జిల్లాకు చెందిన ఓ బాలిక ఏకంగా చంద్రబాబు ఎదుటే తేల్చి చెప్పింది. చదువుల పండుగలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారంవిశాఖపట్నం జిల్లా ఆనందవరంలో జరిగిన సభలో ప్రసంగించారు. చిన్నారులందరినీ వేదికపై కూర్చోపెట్టుకొని చతురోక్తులు, ఆసక్తికరమైన సంభాషణలతో చంద్రబాబు వారిని అలరించారు. చదువు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చెప్పమంటూ చంద్రబాబు ఓ బాలికకు మైక్ ఇచ్చారు. బాగా చదువుకుంటే చంద్రబాబు లాగా ముఖ్యమంత్రి కావచ్చునని ఆ బాలిక సమాధానం ఇచ్చే సరికి సభాస్థలి నవ్వుల పందిరిగా మారింది. 5 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికల్ని స్కూలుకు పంపని వారిపై చట్టరీత్యా చర్యతీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
