ఎన్నికలు ఎప్పుడైనా గెలుపు మాదే
న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము గెలిచి తీరుతామని ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని ఆయన పూర్తిగా సమర్థించారు.
ప్రసంగించారు. మోడిపై ప్రతిపక్షాలు చేస్తున్నవిమర్శలను ప్రస్తావిస్తూ- దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో మోడి రెండోవారనిసర్వేలో తేలిందని ఆయన చెప్పారు.
కొన్ని రాష్ట్రాల్లో బిజెపి ఓడిపోయిన నేపథ్యంలో గుజరాత్‌లో తాము అధికారంలోకి రాగలమని కాంగ్రెస్ కలలు కంటోందని ఆయన వ్యాఖ్యానించారు. పరిస్థితిలో మార్పు వచ్చిందని, గోవాఅసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిచిందని ఆయన అన్నారు. బిజెపి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై సందేహాలు వ్యక్తం చేసిన పార్టీలు అది పూర్తి కాలం మనుగడ సాగించగలదనే నమ్మకానికి వచ్చారని, దీంతో ప్రతిపక్షాలు దుష్ప్రచారానికి దిగుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
