శివానీ హత్య కేసును సిబిఐకిఅప్పగించం

పానీపట్‌: ఇండియన్‌ఎక్స్‌ప్రెస్‌ జర్నలిస్టు శివానీ భట్నాగర్‌ హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ)కి అప్పగించే ప్రసక్తి లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఐ.డి.స్వామి చెప్పారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు తుది దశలో ఉన్నందున ఈ కేసును సిబిఐకిఅప్పగించాల్సిన అవసరం లేదని ఆయన శనివారంవిలేకరులతో అన్నారు.

పైగా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోనిదని, కేంద్ర ప్రభుత్వ పరిధఙలోది కాదని ఆయన అన్నారు. ఈ కేసుతో కేంద్ర మంత్రి ప్రమోద్‌ మహాజన్‌కు సంబంధం ఉన్నదని కేసులోని ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి శర్మ భార్య మధుశర్మ చేసి ఆరోపణలనువిలేకరులు ప్రస్తావించగా రుజువులు లేని ఆరోపణలుఅర్థరహితమని, ఆ ఆరోపణలను ధృవీకరించే రుజువులను ఆమెను ఇవ్వమనండని మంత్రి అన్నారు.

మహాజన్‌ను ప్రశ్నంచం: కమీషనర్‌

న్యూఢిల్లీ: ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ జర్నలిస్టు శివానీ భట్నాగర్‌ హత్య కేసులో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్‌ మహాజన్‌ను ప్రశ్నించే సమస్య లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో తాను ఎటువంటి దర్యాప్తునకైనా సిద్ధమేనని ప్రమోద్‌ మహాజన్‌ శుక్రవారంనాడు ప్రకటించారు.

కేసు దర్యాప్తులో తమ వద్ద ఉన్న ఎవరెవరి పేర్లయితే ఉన్నాయో వారినే ప్రశ్నిస్తామని పోలీసులు శనివారంనాడు చెప్పారు. తమ వద్ద ప్రమోద్‌ మహాజన్‌పేరు లేదని, అందువల్ల మహాజన్‌ను ప్రశ్నించే ప్రసక్తి లేదని ఢిల్లీ పోలీసు కమీషనర్‌ ఆర్‌.ఎస్‌. గుప్తా అన్నారు. ఒక వ్యక్తిపై ఎవరో ఒకరు ఆరోపణలు చేసినంత మాత్రాన తాము ఆ వ్యక్తిని ప్రశ్నించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
కేసును మీడియా అనవసరంగా ఎక్కువ చేసిందని,ఆర్‌.కె. శర్మ వేలాది మంది పోలీసుల్లో ఒకరని ఆయన అన్నారు. ఈ కేసులో శ్రీభగవాన్‌, ప్రదీప్‌, సత్యప్రకాశ్‌ అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+