నక్సల్స్ చెరలో పోలీసులు క్షేమం!
విశాఖపట్నం: తమ వెంట తీసుకెళ్లిన పోలీసు కానిస్టేబుల్స్‌ను విడిచిపెట్టాలని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి)పేర్వారం రాములు నిషిద్ధ పీపుల్స్‌వార్ నక్సలైట్లకువిజ్ఞప్తి చేశారు. నక్సల్స్ విశాఖపట్నం జిల్లా అనకాపల్లి, చోడవరం పోలీసుస్టేషన్లపై దాడి చేసి నలుగురు కానిస్టేబుల్స్‌ను తమ వెంట తీసికెళ్లారు.
పోలీసు స్టేషన్లపై దాడికి నక్సల్స్ వాడిన మినీ బస్సును, టిప్పర్‌ను పోలీసులు మాడుగుల సమీపంలోస్వాధీనం చేసుకున్నారు. పోలీసు స్టేషన్లపై దాడికి నిరంజన్ అనేపీపుల్స్‌వార్ దళనాయకుడు నాయకత్వం వహించాడని చెబుతున్నారని, తమ వద్ద ఉన్న సమాచారం మేరకుఒరిస్సా, ఆంధ్ర సరిహద్దుల్లో పని చేస్తున్న నేత దేవన్న అని, అతనిఅసలు పేరు చంద్రమౌళి అని, అతను కరీంనగర్ జిల్లాకు చెందినవాడని డిజిపివివరించారు. పోలీసు స్టేషన్లపై దాడికి తెలంగాణకు చెందినపీపుల్స్‌వార్ నాయకులు నాయకత్వం వహించగా, గిరిజనులు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
