జాతీయ విపత్తుగా అనంత కరవు

అనంతపురంః అనంతపురం జిల్లాను కరవు పట్టి పీడిస్తున్నదని, దీనిని జాతీయ విపత్తుగా పరిగణించాలని తెలుగుదేశం పార్టీ కోరింది. రాష్ట్రంలో కరవు పరిస్థితినిఅంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం బుధవారం అనంతపురం జిల్లాలో పర్యటించింది. అనంతపురం తీవ్రమైన కరవు కోరల్లో చిక్కుకున్నదని,మిగిలిన జిల్లాల మాదిరిగా కాకుండా ఈ జిల్లాకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించి భారీ నిధులతో ఆదుకోవాలని జిల్లా తెలుగుదేశం నేతలు కరవు బృందానికివిజ్ఞప్తి చేశారు.

అనంతపురం జిల్లా కొన్నేళ్ళుగా తీవ్రదుర్భిక్షంలో చిక్కుకున్నదని, నదీ జలాలలను జిల్లాకు మళ్ళించనిదే కరవు తగ్గదని కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్ష పార్టీలు కరవు బృందాన్నికోరాయి. జాతీయ జలవిధానంలో మార్పులు చేసి అనంతపురం జిల్లాకు నదీ జలాలలను మళ్లించాలని వారుకోరారు. రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసేందుకు వచ్చిన కరవు బృందం మూడు రోజులుగా వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నవిషయం విదితమే.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+