ముగ్గురు కొత్త మంత్రులు- శాఖల మార్పు
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలోస్వల్ప మార్పులు మాత్రమే చేశారు. ముగ్గురు కొత్త మంత్రులకు మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఊహించినట్లుగా బాబుమోహన్,సి. ముత్యంరెడ్డి, నేరెళ్ల ఆంజనేయులలకు మంత్రి పదవులు ఇచ్చారు.
ఒక రకంగా తన మంత్రివర్గంలోని ఖాళీలను భర్తీ చేశారు. ఉన్నతవిద్యాశాఖ మంత్రి కరణం రామచంద్రరావు మృతి చెందారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కున్న కార్మిక శాఖ మంత్రి సుద్దాల దేవయ్య రాజీనామా చేశారు. పంచాయతీరాజ్ శాఖలోస్టేషనరీ కుంభకోణానికి నైతిక బాధ్యత వహించి ఆ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా చేశారు. ఈ ముగ్గురి స్థానాల్లో ముగ్గురు కొత్త మంత్రులను తీసుకున్నారు.
కొత్త మంత్రుల్లో బాబుమోహన్‌కు కార్మిక శాఖను,సి. ముత్యంరెడ్డికి పౌరసరఫరాల శాఖను, నేరేళ్ల ఆంజనేయులుకు సాంకేతికవిద్యను అప్పగించారు. మంత్రివర్గంలో మూడు ఖాళీలు కూడా తెలంగాణ ప్రాంతం నుంచే ఏర్పడ్డాయి. దీంతో ముగ్గురు కొత్త మంత్రులను కూడా తెలంగాణ నుంచే చంద్రబాబు తీసుకున్నారు. బాబూమోహన్, ముత్యంరెడ్డి మెదక్ జిల్లాకు చెందినవారు కాగా ఆంజనేయులు నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. రాజీనామా చేసిన సుద్దాల దేవయ్య కరీంనగర్ జిల్లాకు చెందినవారు.అస్వస్థతతో మృతి చెందిన కరణం రామచంద్రారెడ్డి మెదక్ జిల్లాకు చెందినవారు. ఇటీవలే రాజీనామా చేసిన పోచారం శ్రీనివాస రెడ్డి నిజామాబాద్ జిల్లాకు చెందినవారు.












Click it and Unblock the Notifications