వరంగల్: వరంగల్ జిల్లా కాజీపేటలోరైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్‌ను రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారంశంకుస్థాపన చేశారు. దీనికి 25 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి.
ఈస్ట్‌కోస్ట్‌ఎక్స్‌ప్రెస్ రైలులో మంత్రి కాజీపేట చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తమైంది. మంత్రిని అటకాయించడానికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కాకపోవడాన్ని నిరిసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ఆందోళనకు దిగారు.