న్యూయార్క్: ఉగ్రవాదంవిషయంలో పాకిస్థాన్‌కు తాము నచ్చజెప్పుతామని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద చర్యలను పాకిస్థాన్‌స్వాతంత్ర్య సమరంగా అభివర్ణించడాన్ని ఆయన వ్యతిరేకించారు.
జమ్మూ కాశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా,స్వేచ్ఛగా జరగడానికి పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకుండా తన పలుకుబడిని ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బుష్‌తో భారత ప్రధాని వాజ్‌పేయి దాదాపు 35 నిమిషాలసేపు సమావేశమయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లోని హత్యల పట్ల ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల హత్యల పట్ల బుష్ తీవ్ర ఆక్షేపణ తెలియజేశారు. అమెరికా ఏ విధమైన ఉగ్రవాదాన్ని కూడా సహించబోదని ఆయన అన్నారు. కాశ్మీర్‌లో వారుస్వాతంత్ర్య పోరాటం చేస్తుంటే స్వాతంత్ర్య పోరాట సూత్రాలకు కట్టబడాలని ఆయన అభిప్రాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని అమెరికా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.