వెస్టిండీస్ పై దక్షిణాఫ్రికావిజయం
కొలొంబో: ఐసిసి ఛాంపియన్స్ టోర్నీలో భాగంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల మధ్య శుక్రవారం కొలొంబోలో జరిగిన వన్డే మ్యాచ్ లో దక్షిణాఫ్రికావిజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా రెండువికెట్ల తేడాతో వెస్టిండీస్ పై గెలిచింది. ఆద్యంతం ఉత్య49 ఓవర్లలో 239 పరుగుల లక్ష్యాన్ని చివరి బాల్ లో ఛేదించింది. చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా దక్షిణాఫ్రికా చివరి బాల్ లో నాలుగు పరుగులు సాధించివిజయాన్ని కైవసం చేసుకొంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా వెస్టిండీస్ కు బ్యాటింగ్‌అప్పచెప్పింది. ఎనిమిది వికెట్ల నష్టానికి వెస్టిండీస్ జట్టు 238 పరుగులు చేసింది.
జాంటీ రోడ్స్, బోయెట్ ల అధ్భుతమైన భాగస్వామ్యంతో తేరుకోగలగింది. 4వవికెట్ కు 115 పరుగుల భాగస్వామ్యంతో వీరు ఇరువరూ దక్షిణాఫ్రికాను గట్టెక్కించారు. అయితే, ఆఖర్లో కార్ల్ హూపర్ వెంటవెంటనే రెండువికెట్లు పడగొట్టడంతో వెస్టిండీస్ విజయం ఖాయం అనుకున్నారు. దక్షిణాఫ్రికా చివరి బ్యాట్స్ మెన్ సమర్ధంగా నిలదొక్కుకోవడంతోవిజయం వారినే వరించింది. 61 పరుగులు చేసిన జాంటీ రోడ్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.












Click it and Unblock the Notifications