హైదరాబాద్‌లో ప్రబలుతోన్న డెంగ్యూ!
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిహైదరాబాద్ లో డెంగ్యూ వ్యాధిప్రబలుతోంది. ఇప్పటికే పలువరు ఈ వ్యాధి బారిన పడ్డారు. ఆలస్యంగామేలుకొన్న ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నట్లు శుక్రవారంప్రకటించింది. కొత్తగా వైద్యశాఖను చేపట్టినకోడెల శివప్రసాద్ శుక్రవారం సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిని ఆకస్మికంగాసందర్శించారు. డెంగ్యూ వ్యాధి బారిన పడ్డ రోగులనుఆయన కలుసుకొని పరామర్శించారు.
ఆసుపత్రిలోని సౌకర్యాలపై, పరిశుభ్రతపైకోడెల అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరంవిలేకరులతో ఆయన మాట్లాడారు. మొత్తంనగరం అంతా ఫాగింగ్ చేయిస్తున్నాం. ఒక రకమైనదోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంటుంది.ఇది పగలే కుడుతుంది. అందుకే నగరంలోనిఅన్ని ప్రదేశాల్లో ఫాగింగ్ చేయిస్తున్నామని వివరించారు.తొలుత వరంగల్ లో ఈ వ్యాధి ప్రబలింది. ఆ తర్వాత కృష్ణా, తదితర జిల్లాలకు పాకింది. కొన్ని ప్రత్యేక వైద్యబృందాలను వరంగల్, కృష్ణా జిల్లాలకు పంపించాలని నిర్ణయించినట్లు కోడెల తెలిపారు.












Click it and Unblock the Notifications