ఎటువంటి అసంతృప్తి లేదు: దేవేందర్
హైదరాబాద్: మంత్రివర్గవిస్తరణపై తాను అసంతృప్తితో ఉన్నట్టు వచ్చిన వార్తలను రాష్ట్ర హోంమంత్రి టి.దేవేందర్ గౌడ్ తోసిపుచ్చారు. అవి నిరాధారమైన వార్తలని ఆయన శుక్రవారం తనను కలిసినవిలేకరులతో అన్నారు. గురువారం ముఖ్యమంత్రి అధ్వర్యంలో శాంతిభద్రతలపై జరిగిన సమావేశానికి దేవేందర్ గౌడ్‌హాజరు కాలేదు. దీంతో ఆయన మంత్రివర్గవిస్తరణపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరగింది.
వ్యక్తిగత కారణాల వల్లే నేను హాజరు కాలేదు. ఏదైనా సమస్య ఉంటే దాన్ని ముఖ్యమంత్రికి తెలియచేసే చొరవ నాకుంది. ఇలాగైర్హాజరై అలక పూనాల్సిన అవసరం లేదని ఆయనవివరించారు. మీడియా నిజానిజాలను తెలుసుకొని వార్తలు రాయలని ఆయన హితవు పలికారు.
తన వ్యతిరేక వర్గం ఇలా ప్రచారం చేపట్టి ఉండొచ్చు కదా అనివిలేకరులు ప్రశ్నించగా, నో కామెంట్ అని దాటవేశారు. ఈవిషయంపై ఏమీ మాట్లాడదల్చుకోలేదు. ఏమీ లేని చోట ఏదో తవ్వాలనుకోవడం శుద్దదండగఅని వ్యాఖ్యనించారు.












Click it and Unblock the Notifications