గుజరాత్‌ హింస అపశృతి: వాజ్‌పేయి

న్యూయార్క్‌: గుజారాత్‌లో ఇటీవలి మత హింస అపశృతి మాత్రమేనని, ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉన్నదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. అమెరికా యూదు నాయకులతో సమావేశం సందర్భంగా గుజరాత్‌ సమస్య ప్రస్తావనకు వచ్చింది.

మతఘర్షణల తర్వాత రాష్ట్రం గురించి దురగావహన వ్యాపించిందని, గుజరాత్‌లో జరిగింది అపశృతి మాత్రమేనని, సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. గుజరాత్‌లో పలువురు విదేశీయులు పర్యటించారని, పరిస్థితి గురించి వారు చర్చించుకుని ప్రస్తుత స్థితి గురించి వారు నిర్ణయాలకు రావచ్చునని ఆయన అన్నారు.

నిజానికి భిన్న సామాజికవర్గాలు గుజరాత్‌లో శతాబ్దాల తరబడిగా సహజీవనం సాగిస్తున్నాయని, గుజరాత్‌కు సహన సంప్రదాయం ఉన్నదని, మహాత్మాగాంధీ, సర్దార్‌ పటేల్‌లు జన్మించిన రాష్ట్రమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+