ముషార్రఫ్‌ది పబ్లిసిటి స్టంట్: భారత్
న్యూయార్క్: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో దేశంలో, విదేశాల్లో ప్రచారం పొందడానికే ఐక్యరాజ్య సమితిసర్వప్రతినిధి సభలో పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్ భారత్‌పై ధ్వజమెత్తినట్లు భారత్ అభివర్ణించింది. ముషార్రఫ్‌ది పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి కన్వల్ సిబాల్ శుక్రవారంవిలేకరులతో అన్నారు.
గుజరాత్ ఊచకోతలు హిందూ అతివాదుల పుణ్యమేనని ముషార్రఫ్‌విమర్శించారు. హిందూ అతి వాదాన్ని అడ్డుకోవడానికి అంతర్జాతయ సమాజం నడుం బిగించాలని ఆయనకోరారు. భారతదేశం తమను బెదిరిస్తోందని, ఏడాది కాలంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఆయన అన్నారు. కాశ్మీర్‌లో రాజ్యహింసకుస్వస్తి చెప్పాలని ఆయన అన్నారు. భారత ఆంతరంగిక వ్యవహారాలను స్పృశిస్తూ భారత్‌పై తీవ్రంగా ధ్వజమెత్తుతూ ముషర్రాఫ్ ప్రసంగం సాగింది.












Click it and Unblock the Notifications